బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోంది

ABN , First Publish Date - 2023-05-20T00:58:22+05:30 IST

దేశంలో బీజేపి గ్రాఫ్‌ పడిపోతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌ అన్నారు. శుక్రవారం సీపీఎం డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి ఈదులగూడెం చౌరస్తాలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోంది

కమ్యూనిస్టు విధానాలకే ప్రజలు పట్టం కడుతున్నారు

పొత్తు ఉన్నా లేకపోయినా మిర్యాలగూడలో పోటీ చేస్తాం

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వెంకట్‌

మిర్యాలగూడ, మే 19: దేశంలో బీజేపి గ్రాఫ్‌ పడిపోతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌ అన్నారు. శుక్రవారం సీపీఎం డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి ఈదులగూడెం చౌరస్తాలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్లకు పంచడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలు కమ్యూనిస్టు విధానాలకే పట్టం కడుతున్నారని చెప్పారు. పొత్తు ఉన్నా, లేకపోయి నా మిర్యాలగూడలో సీపీఎం పోటీ చేస్తుందన్నారు. ప్రశ్నించే గొంతుకలను అసెంబ్లీకీ పం పించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపైనే ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సాగర్‌, జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సుందరయ్య ఆదర్శమైన కమ్యూనిస్టుగా నిలిచారన్నారు. సుందరయ్య చూపిన మార్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధ్యయనం, వాటి పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజా సమస్యలు చర్చకు వస్తాయన్నారు. పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నారీ ఐలయ్య, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడావత్‌ రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, పాదూరి శశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్‌, రెమిడాల పరుశరాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రాంమూర్తి, వరలక్ష్మి, అవుతా సైదులు, ఆయూబ్‌, రమేష్‌, రొండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-20T00:58:22+05:30 IST