Muthireddy: నేను కేసీఆర్‌కు సైనికుడిని.. వాళ్ల దొంగ బతుకులను చూసి బాధపడ్డా..

ABN , First Publish Date - 2023-08-17T20:39:35+05:30 IST

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై (MLC Palla Rajeshwar Reddy) జనగామ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (BRS MLA Muthireddy Yadagiri Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Muthireddy: నేను కేసీఆర్‌కు సైనికుడిని.. వాళ్ల దొంగ బతుకులను చూసి బాధపడ్డా..

జనగామ: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై (MLC Palla Rajeshwar Reddy) జనగామ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (BRS MLA Muthireddy Yadagiri Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జనగాం నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS)లో అంతర్గత పోరు మొదలైంది. జనగామ టికెట్‌పై బీఆర్ఎస్‌లో రాజకీయం ముదురుతోంది. హరితా ప్లాజా వేదికగా బుధవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.


"చాయ్‌లు, సమోసాలు తినే వాళ్లు కొందరు నిన్న హరితా ప్లాజా సమావేశంలో ఉన్నారు. మా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ నిన్నటి సమావేశంలో లేదు. స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా నాతోనే ఉన్నారు. నిన్న సమావేశం పెట్టుకున్న వాళ్ల దగ్గరకు నేను వెళ్లాను. రూంలో ఉండి తలుపులు పెట్టున్నారు. అలా భయపడి బతకటం ఎందుకు. నిన్న హోటల్‌లో గంప కింద కోళ్లను కమ్మినట్టు కమ్మారు. వాళ్ల దొంగ బతుకులను చూసి బాధపడ్డా. అభివృద్ధికి అడ్డం పడితే కఠినంగా వ్యవహరించా. గుండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్నే. గుండాగిరి చేస్తే సింహా స్వప్నంలా మారాను. నాపై కావాలని వివాదాలు సృష్టించారు. ఈ కుట్రలు కుతంత్రాలు కేసీఆర్‌కు తెలుసు. నేను కేసీఆర్‌కు సైనికుడిని." అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.

జనగామ, మద్దూర్, జనగామ రూరల్, బచ్చన్నపేట, తరిగొప్పుల, చేర్యాల, కొమురవేల్లి మండలాల నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే టికెట్ ఇవ్వాలని సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎమ్మెల్యేకు తీర్మానం కాపీని అందించారు.

Updated Date - 2023-08-17T20:40:42+05:30 IST