BRS: పాపం.. బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారం వాయిదా పడింది.. కారణం ఏంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-11-04T10:39:16+05:30 IST
మలక్‌పేట నియోజకవర్గం(Malakpet Constituency) బీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల ఆజిత్ రెడ్డి

సైదాబాద్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మలక్‌పేట నియోజకవర్గం(Malakpet Constituency) బీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల ఆజిత్ రెడ్డి(Tigala Ajith Reddy) సైదాబాద్ డివిజన్ నుంచి శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని భావించారు. అధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. ప్రచారానికి సమాయత్తం అవుతుండగా, తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రారంభిస్తారని స్థానిక నేతలు ప్రశ్నించడంతో అభ్యర్థి అవాక్కయ్యారు. చేసేది లేక ప్రచారం వాయిదా వేసుకున్నారు.
