ఇంకా ఊగిసలాటలోనే మాజీ ఎంపీ వివేక్..
ABN , First Publish Date - 2023-10-30T09:58:46+05:30 IST
ఇంకా ఊగిసలాటలో బీజేపీ నేత, మాజీ ఎంపీ ఎంపీ వివేక్ ఉన్నారు. అయితే బీజేపీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ మార్పు విషయంలో ఆయన ఇంకా స్పందించలేదు.

మంచిర్యాల : ఇంకా ఊగిసలాటలో బీజేపీ నేత, మాజీ ఎంపీ ఎంపీ వివేక్ ఉన్నారు. అయితే బీజేపీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ మార్పు విషయంలో ఆయన ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్‌లో చేరి చెన్నూరు బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. పొత్తులో సీపీఐకి ఇస్తామని మొదట్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు మాజీ ఎంపీ వివేక్ లేదా ఆయన కుమారుడిని పోటీ చేయించాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీటు వ్యవహారం పొత్తుపై ప్రభావం చూపుతోందని సీపీఐ చెబుతోంది.