గుట్టుగా ఫిల్టర్ ఇసుక తయారీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 10:51 PM
మండలంలో కొంతకాలంగా సాగుతున్న ఫిల్టర్ ఇసుక రీచ్‌లపై అధికారులు గురువారం దాడులు చే శారు.

అధికారుల దాడులు - ఇసుక రీచ్‌లు సీజ్
గట్టు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో కొంతకాలంగా సాగుతున్న ఫిల్టర్ ఇసుక రీచ్‌లపై అధికారులు గురువారం దాడులు చే శారు. మండలంలోని చిన్నోనిపల్లి, బోయలగుడ్డం, లింగాపురం, చాగదోణ గ్రామాల మధ్యన వాగులు, వంకల సమీపంలో ఫిల్టర్ ఇసుక త యారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రావడంతో పాటు, అధికారులకు సమాచారం అంది నది. ఇందుకు అధికారులు స్పందించి రీచ్‌లను గుర్తించారు. తహసీల్దార్ సలీముద్దిన్, ఎస్‌ఐ కేటీ మల్లేష్‌తో పాటు ఆర్‌ఐ రాజు, మిగతా పోలీస్‌సిబ్బంది అడవిలో నిల్వ చేసిన రీచ్‌లను గుర్తించారు. ఇసుకను ఫిల్టర్ చేయడానికి ఉప యోగిస్తున్న నీటి పైపులను, ఇసుక దిబ్బలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫిల్టర్ ఇసుక ను తయారు చేస్తున్న ట్రాక్టర్ల యాజమానుల ను గుర్తించినట్లు ఎస్‌ఐ కేటీ మల్లేష్ తెలిపారు. జేసీబీ వెంకటేష్, చిన్నోనిపల్లి రమేష్‌తో పాటు మరికొందరు ఇసుక ఫిల్టర్ చేస్తున్నట్లు తెలిసిందని ఎస్‌ఐ తెలిపారు. మొత్తం 16 ట్రాక్టర్ల ఇసు క, రెండు ట్రాక్టర్ల మట్టిని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ సలీముద్దిన్ తెలిపారు. సీజ్ చేసిన ఇసుక నిల్వల దగ్గర వీఆర్ ఏలను కాపలా ఉంచినట్లు తెలిపారు.