Vijayashanti: ‘బీఆర్‌ఎస్‌ పేరు చెబితే ఆ పార్టీలు భయపడుతున్నాయి’

ABN , First Publish Date - 2023-05-04T16:10:47+05:30 IST

బీఆర్‌ఎస్ పేరు చెబితే మిగితా రాష్ట్రాల రాజకీయా పార్టీలు భయపడుతున్నాయని... ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: ‘బీఆర్‌ఎస్‌ పేరు చెబితే ఆ పార్టీలు భయపడుతున్నాయి’

హైదరాబాద్: బీఆర్‌ఎస్ పేరు చెబితే మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని... ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి నెలకొందని అని బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) అన్నారు. గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి... ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చెయ్యవలసిన దుర్మార్గాన్ని తయారు చేశారని మండిపడ్డారు. మున్ముందు దేశమంతా ఇదే భ్రష్టాచార వ్యవస్థను బీఆర్‌ఎస్ పేరుతో, తెలంగాణలో దోపిడీ చెయ్యబడ్డ లక్షల కోట్ల అవినీతి ధనం తోడ్పాటుతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు తామే భరిస్తామని కేసీఆర్ వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసి, నియంతృత్వ ఫ్యూడల్ ధోరణికి దారి చేస్తున్న పరిస్థితి కావచ్చేమో అని వ్యాఖ్యలు చేశారు.

అటు ఏపీలో జనసేన పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో మోసగించి దెబ్బ తియ్యాలనే ప్రయత్నం ఆంధ్రజ్యోతి వంటి అగ్రశ్రేణి దినపత్రికలలో వార్తలుగా వచ్చిందని రాములమ్మ అన్నారు. ఇక అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్‌ఎస్ కుటుంబం ఢిల్లీ, పంజాబ్‌లలో తెచ్చిపెట్టిన స్కాంల సమస్యతో ఆప్ అసలుకే నాశనమయ్యేట్లు అనిపిస్తున్నదంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

vijayashanti2.jpg

The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-04T18:42:45+05:30 IST