Vijayashanti: బీజేపీని వీడతారన్న వార్తలపై రాములమ్మ సమాధానం ఇదే...

ABN , First Publish Date - 2023-06-05T14:41:58+05:30 IST

బీజేపీ నేత విజయశాంతి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని రాములమ్మ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని.. బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

Vijayashanti: బీజేపీని వీడతారన్న వార్తలపై రాములమ్మ సమాధానం ఇదే...

హైదరాబాద్: బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని రాములమ్మ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని.. బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ...‘‘రెండు రోజుల నుంచి రాములమ్మ బీజేపీ పార్టీతో దూరమవుతున్నారు... పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నాయని సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇది సరైనదో కాదో ప్రచారం చేసేటోళ్లకు తెలియాలి. నేనైతే మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, "గరళకంఠుని" సన్నిధానంలో ఆ ఆదిదేవుని దర్శనార్థమై.. హరహర మహాదేవ్’’ అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-05T14:43:19+05:30 IST