ఎన్టీఆర్‌ ట్రస్టు డైరీ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-01-01T03:01:33+05:30 IST

ఎన్టీఆర్‌ ట్రస్టు 2023 సంవత్సరపు డిజిటల్‌ క్యాలెండర్‌ యాప్‌ను, డైరీని ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం ఆవిష్కరించారు.

ఎన్టీఆర్‌ ట్రస్టు డైరీ ఆవిష్కరణ

డిజిటల్‌ క్యాలెండర్‌ యాప్‌ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్‌, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ట్రస్టు 2023 సంవత్సరపు డిజిటల్‌ క్యాలెండర్‌ యాప్‌ను, డైరీని ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్‌, అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డిజిటల్‌ క్యాలెండర్‌ యాప్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లేస్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ట్రస్టు బ్లడ్‌ బ్యాంకులో రక్త నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని, ట్రస్టు సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని, ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలనుకునే వారూ ఈ యాప్‌ ద్వారా ఇవ్వవచ్చని వెల్లడించారు.

Updated Date - 2023-01-01T03:01:34+05:30 IST