TS NEWS: కూకట్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం
ABN , First Publish Date - 2023-09-01T20:23:21+05:30 IST
నగరంలో దారుణం జరిగింది. యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. తనను ప్రేమించటం లేదని లీలా నాగజ్యోతి అనే యువతిపై రాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్(Hyderabad): నగరంలో దారుణం జరిగింది. యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. తనను ప్రేమించటం లేదని లీలా నాగజ్యోతి అనే యువతిపై రాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈఘటన కూకట్‌పల్లి(Kukatpally) విజయ నగర కాలనీలో జరిగింది. కత్తితో దాడి చేయడంతో నాగ జ్యోతికి మెడపై తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు నాగజ్యోతిపై దాడి అనంతరం రాజు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు.ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ప్రైవేట్ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. నిందితుడు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.