Share News

Renuka Chowdhury: సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2023-10-14T14:53:38+05:30 IST

సీఎం కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Renuka Chowdhury: సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు గాంధీభవన్‌లో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ..‘‘ గ్రూప్‌-2 వాయిదాతో నిన్న హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో...విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఖబార్దార్ కేసీఆర్... జాగ్రత్తగా ఉండు అంటూ కేసీఆర్‌ని హెచ్చరించారు. నిస్సహాయతతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. అప్పులు చేసి తల్లితండ్రులు పిల్లలని చదివిపిస్తున్నారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ(TSPSC)పై సీబీఐ విచారణ జరిపించాలి. విద్యార్థులను పోలీసులు చావబాదుతున్నారు. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులకు మనసులేదా? ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటూ.... విద్యార్థులను కొడతారా? మేం అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ(TSPSC)పై విచారణ జరిపిస్తాం. విద్యార్థుల ప్రాణాలకి విలువ లేదా? కేసీఆర్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి తన జాతకం, గోత్రం మార్చుకున్నాడు. ఇది పనికి మాలిన ప్రభుత్వం. మాటలకి జీఎస్టీ లేదు కాబట్టి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఐటీ కింగ్ అంటాడు. పేపర్ల లీకేజీకి కేటీఆర్ బాధ్యత వహించాలి’’ అని రేణుకాచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-14T14:53:38+05:30 IST