Share News

Hyderabad: 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2023-12-07T12:04:57+05:30 IST

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నేరుగా 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ 12:55 గంటలకు ఎల్బీ స్టేడియంకు వస్తారు.

Hyderabad: 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నేరుగా 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ 12:55 గంటలకు ఎల్బీ స్టేడియంకు వస్తారు. ముహూర్తం ప్రకారం 1.04 గంటలకు గవర్నర్‌ రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. 1:25 గంటలకు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారు. చివరగా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలితో గ్రూప్ ఫోటో ఉంటుంది. దీంతో కార్యక్రమం ముగుస్తుంది.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు.. పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని అడిషనల్‌ సీపీ వెల్లడించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-12-07T12:04:58+05:30 IST