Share News

Revanth Reddy: ఆరు గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం

ABN , First Publish Date - 2023-12-07T08:06:25+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలకు ఆయన ఆహ్వానం పంపారు.

Revanth Reddy: ఆరు గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలకు ఆయన ఆహ్వానం పంపారు. ప్రమాణం చేసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేయనున్నారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక రానున్నారు. అలాగే ఏఐసీసీ పెద్దలు, పలు రాష్ట్రాల కీలక నేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులుగా తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆయన ఆహ్వానం పంపారు. స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక, రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాటు చేశారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ, 30 వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు.. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-12-07T08:34:08+05:30 IST