TDP Formation Day : చంద్రబాబు గురించి కాసాని జ్ణానేశ్వర్ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2023-03-29T21:51:47+05:30 IST

పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై పుట్టిన తెలుగుదేశం పార్టీ జెండాను గ్రామగ్రామాన ఎగురవేయాల్సిన బాధ్యత పార్టీశ్రేణులు, తెలుగుప్రజలపై ఉందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పిలుపునిచ్చారు.

TDP Formation Day : చంద్రబాబు గురించి కాసాని జ్ణానేశ్వర్ ఏమన్నాడంటే..

హైదరాబాద్: పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై పుట్టిన తెలుగుదేశం పార్టీ జెండాను గ్రామగ్రామాన ఎగురవేయాల్సిన బాధ్యత పార్టీశ్రేణులు, తెలుగుప్రజలపై ఉందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా తెలుగు దేశం పార్టీ స్థాపించి.. తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత ఎన్టీఆర్ కొనియాడారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి బీసీ నేతలకు ప్రోత్సహించారన్నారు.

పంచాయతీ వ్యవస్థలో సమితులు, బ్లాక్‌లను రద్దుచేసి మండలాలు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. తినడానికి తిండి, బట్ట, గూడు లేని పేదలకు ఇళ్లు కట్టించి, 2రూపాయలకే బియ్యం అందించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

ఎన్టీఆర్ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు విజన్ 2020 పేరుతో హైదరాబాద్‌లో ఐటీ పార్కులు ఏర్పాటు, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంతో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ ఖ్యాతిని దేశ విదేశాల్లో విస్తరించడంలో చంద్రబాబునాయుడు కృషి మరచిపోలేనిదని జ్ణానేశ్వర్ అన్నారు.పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ జెండాను గ్రామగ్రామాన ఎగురవేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలపై ఉందన్నారు.

Updated Date - 2023-03-29T21:51:47+05:30 IST