TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

ABN , First Publish Date - 2023-09-21T17:30:56+05:30 IST

తెలుగు పండుగలల్లో అతి ముఖ్యమైన పండుగ విజయదశమి. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండుగ(Dussehra festival) రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త(Telangana RTC is good news) తెలిపింది.

TSRTC: దసరాకు సొంతూళ్లకు  వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్: తెలుగు పండుగలల్లో అతి ముఖ్యమైన పండుగ విజయదశమి. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండుగ(Dussehra festival) రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త(Telangana RTC is good news) తెలిపింది. ముందస్తు బుకింగ్ చేసుకునేవారికి 10 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 15-29 మధ్య రానుపోనూ టికెట్లు బుక్ చేసుకుంటే రాయితీ ఇస్తోంది. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోగా రిజర్వేషన్ చేసుకుంటేనే రాయితీ సౌకర్యం ఉంటుందని టీఎస్ఆర్టీసీ(TSRTC) స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం కలిగిన అన్ని రకాల బస్సుల్లో ఈ రాయితీ అమలు చేస్తామని వివరించింది. దూరప్రాంతాలకు వెళ్లేవారికి ఈ రాయితీ ఉపయుక్తంగా ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ బంపరాఫర్ ప్రకటించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-21T17:35:04+05:30 IST