TSPSC: జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2023-03-20T21:49:57+05:30 IST

జేఎల్ నియామక పరీక్ష(JL Recruitment Test) ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు(High Court) ఆదేశించింది.

TSPSC: జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్: జేఎల్ నియామక పరీక్ష(JL Recruitment Test) ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. జేఎల్(Junior Lecturer) పేపర్-2 ఆంగ్లంలోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లీషు, తెలుగులో ఇవ్వాలని టీఎస్పీఎస్సీ(TSPSC) కి హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హెచ్చరించింది.

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకోసం గతేడాది డిసెంబరు 9న టీఎస్‌పీఎస్సీ(TSPSC)నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించే పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. జేఎల్‌ పేపర్‌-2 ప్రశ్నపత్రం ఆంగ్లం, తెలుగులో ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2023-03-20T21:49:57+05:30 IST