CM KCR: కేంద్రానికి చెప్పినా..గోడకు చెప్పినా ఒకటే..
ABN , First Publish Date - 2023-03-23T13:34:04+05:30 IST
జిల్లాలో బోనకల్ మండలం రావినూతలలో సీఎం కేసీఆర్(CM KCR) గురువారం పర్యటించారు. అకాల వర్షంతో..వడగళ్లతో
Khammam: జిల్లాలో బోనకల్ మండలం రావినూతలలో సీఎం కేసీఆర్(CM KCR) గురువారం పర్యటించారు. అకాల వర్షంతో..వడగళ్లతో దెబ్బతిన పంటలను సీఎం(CM) హెలికాప్టర్(Helicopter) నుంచి పరిశీలించారు. గార్లపాడులో కేసీఆర్(KCR) నేలకొరిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎంత పంట వేశారు..ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా తీశారు.. అనంతరం మీడియా సమావేశంలో కేసీఆర్(KCR) మాట్లాడుతూ.. ‘‘వడగళ్ల వానతో రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టం జరిగింది. తెలంగాణలో 2,22,250 ఎకరాల్లో పంటనష్టం..పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు(Farmers) ఆందోళన చెందొద్దు. రాష్ట్రంలో సమస్యలున్నాయని చెప్పినా కేంద్రం పట్టించుకోవట్లేదు. కేంద్రానికి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం. దేశంలో రైతులకు లాభం చేకూర్చే పాలసీలు లేవు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఉన్నాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తాం. కౌలు రైతులను కూడా ఆదుకుంటాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ టూర్లో..మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. ఖమ్మం పర్యటన అనంతరం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్ వెళ్లనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Combined Warangal District) ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా, దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి..అనంతరం తిరుగు హైదరాబాద్ ప్రయాణం కానున్నారు.