బీజేపీ శ్రేణుల సంబురాలు

ABN , First Publish Date - 2023-03-17T23:20:12+05:30 IST

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడం పట్ల సంబురా లు చేసుకున్నారు.

బీజేపీ శ్రేణుల సంబురాలు
వనపర్తి జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుకుంటున్న బీజేపీ నాయకులు

వనపర్తి అర్బన్‌, మార్చి 17: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడం పట్ల సంబురా లు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తా లో శుక్రవారం బీజేపీ పట్టణ కమిటీ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల సమస్యల పట్ల కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలకు విసుగు చెందిన ఉపాధ్యాయ, అధ్యాపకులు పార్టీలకు అతీ తంగా ఏవీఎన్‌ రెడ్డికి మద్ధతుగా నిలిచారన్నారు. 317 జీవో ద్వారా ఉపాధ్యాయ దంపతులకు నరకం చూపెట్టిన కేసీఆర్‌కు ఏవీఎన్‌రెడ్డి గెలుపుతో కళ్లు తెరిపించారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీ కృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం, తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరప్రసాద్‌గౌడ్‌, శశివర్ధన్‌, ప్రభాకర్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, సీతారాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు పరశురాం, శివారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు పెద్దిరాజు, బాబురావు, బచ్చురాము, అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సుగూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి వెంకటనారాయణరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబు రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అవినీతి, అక్రమ పాల నను వ్యతిరేకించి ఉపాధ్యాయులు బీజేపీ బలపరి చిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డిని గెలిపించారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చి బాబు గౌడ్‌, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాం రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆశన్న, గిరిజన మోర్చా అధ్యక్షుడు గోపి నాయక్‌, మండల ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, శివశంకర్‌, బీజేపీ నాయకులు అంజినాయక్‌, రాంచందర్‌, రాఘవేందర్‌ రెడ్డి, వెంకటరమణ, చక్రవర్తిగౌడ్‌, పురుషోత్తం, శాం తయ్య, బెస్తశ్రీను, బండారి శ్రీనివాసులు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పెబ్బేరులో...

పెబ్బేరు/వీపనగండ్ల: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడంతో శుక్రవారం పెబ్బేరు మండ లంలో బీజేపీ నాయకులు సంబురాలు చేసుకున్నా రు. సుభాష్‌ చౌరస్తాలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వీపనగండ్ల మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకు న్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేమారెడ్డి, అనుజ్ఞారెడ్డి, సహదేవుడు, రాఘవేందర్‌గౌడ్‌, నరసిం హనాయుడు, ఆంజనేయులు, బుచ్చన్న, రామకృష్ణ, జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరచింతలో...

అమరచింత :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు పట్ల శుక్రవారం అమరచింతలో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు స్వీట్ల పంపి ణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేర్వ అనిల్‌, రాకేష్‌ శెట్టి, టైలర్‌ నరసింహ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో...

ఆత్మకూర్‌ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు పట్ల ఆత్మకూర్‌ బీజేపీ నాయకులు పటాకులు కాల్చి మిఠాయి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ముని సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అశ్విన్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌ రెడ్డి విజయానికి కృషి చేసిన అందరరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్ర మంలో బీజేపీ మక్తల్‌ నియోజకవర్గం కో కన్వీనర్‌ శ్రీనివాసులు, జిల్లా నాయకులు నాగేంద్రం రెడ్డి, శివశంకర్‌, ఆనంద్‌, విజయ్‌ కుమార్‌, సూరి, చందు, భీమ్‌రెడ్డి, ఎల్లన్న, శేషు, ఆదర్శ్‌, శ్యామ్‌, యశ్వంత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-17T23:20:12+05:30 IST