సంగారెడ్డి జిల్లాలో రూ.వెయ్యి కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-06-17T00:12:17+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని పట్టణాలు అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో రూ.వెయ్యి కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి : కలెక్టర్‌

సదాశివపేట, జూన్‌ 16: సంగారెడ్డి జిల్లాలోని పట్టణాలు అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశామన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం, టీఎ్‌సబీపా్‌సతో అభివృద్ధి వేగం పుంజుకుందని చెప్పారు. మున్సిపాలిటీల్లో ధ్రువీకరణ పత్రాలజారీతో పాటు అన్ని రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపల్‌ పట్టణాల్లో 867 కిలో మీటర్ల కొత్త రహదారులు నిర్మించుకోవడం జరిగిందన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో రూ.103 కోట్లు ఖర్చు చేసి గోదావరి జలాలను ఇంటింటికి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. టీయూఎ్‌ఫఐడిసీ పథకంతో రూ.90 కోట్లు, ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.250 కోట్లు ఖర్చు చేసి పట్టణాల్లో అనేక పనులు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 387 పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించామని చెప్పారు. సదాశివపేట అభివృద్ధి కోసం పట్టణ ప్రగతిలో రూ.185 కోట్లను ఖర్చు చేశామని కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో చైర్పర్సన్‌ పిల్లోడి జయమ్మ, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్‌, కౌన్సిలర్లు పులిమామిడిరాజు, గుండు రవి, విద్యాసాగర్‌రెడ్డి, ఇంద్రమోహన్‌గౌడ్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-17T00:12:17+05:30 IST