దివీ్‌సలో రూ.100 కోట్లతో ఈటీపీ ప్లాంట్‌

ABN , First Publish Date - 2023-06-19T00:14:55+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి.జహంగీర్‌ అన్నారు.

దివీ్‌సలో రూ.100 కోట్లతో ఈటీపీ ప్లాంట్‌
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జహంగీర్‌

భువనగిరి రూరల్‌, జూన్‌ 18: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి.జహంగీర్‌ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన ప్రజా సంఘాల పోరాట వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల కోసం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం అమలు చేసినప్పటికీ అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో నిరుపేదలు ఈ పథకానికి నోచుకోలేకపోయారన్నారు. తిరిగి గ్రామ సభల ద్వారా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, రూ.3లక్షలు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇళ్లు నిర్మించుకున్న పేదలపై ప్రభుత్వ నిర్బంధం వెంటనే ఆపాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికీ పట్టా సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. ఈ నెల 26న తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట జూలై 3న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం నాయకులు మాటూరి బాల్‌రాజ్‌గౌడ్‌, కొండమడుగు నర్సింహ, దాసరి పాండు, కల్లూరి మల్లేశం, గడ్డం వెంకటేశ్‌ బొల్లు యాదగిరి, పెంటయ్య, రాములు, భిక్షపతి, శ్రీను ఉన్నారు.

Updated Date - 2023-06-19T00:14:55+05:30 IST