Telangana Rain Alert : తెలంగాణ ప్రజలారా.. ఈ మూడ్రోజులు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ABN , First Publish Date - 2023-07-24T18:30:41+05:30 IST
తెలంగాణ వర్షాలు (Telangana Rains) వద్దంటే దంచికొడుతున్నాయి.! ఆదివారం, సోమవారం సాయంత్రం వరకూ కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. 05:45 గంటల నుంచి మళ్లీ వాన మొదలైంది.! అయితే.. రానున్న మూడ్రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది..
తెలంగాణ వర్షాలు (Telangana Rains) వద్దంటే దంచికొడుతున్నాయి.! ఆదివారం, సోమవారం సాయంత్రం వరకూ కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. 05:45 గంటల నుంచి మళ్లీ వాన మొదలైంది.! అయితే.. రానున్న మూడ్రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడ్రోజులపాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. సోమవారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
నాలుగు రోజులు జాగ్రత్త..!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు 40-50 కిలోమీటర్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా.. తెలంగాణలో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రేపు అనగా మంగళవారం నాడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. మిగిలిన జిల్లాల్లోనూ మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నాలుగు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం మొదలవ్వడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ కూడా చేయడం జరిగింది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు భీతిల్లిపోతున్నారు. మరో మూడు గంటలపాటు ఇలాగే వర్షం కురుస్తుందని.. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.
ఏపీలో పరిస్థితి ఇలా..!
అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 65 కిలోమీటర్లు వేగంగా ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురువనున్నాయి. మరోవైపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.