బీఆర్‌ఎస్‌కు బలగం ప్రజలు, కార్యకర్తలే
ABN , First Publish Date - 2023-04-16T23:49:08+05:30 IST
బీఆర్‌ఎస్ పార్టీకి బలగం ప్రజలు, కార్యకర్తలేనని ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

కొడంగల్, ఏప్రిల్ 16: బీఆర్‌ఎస్ పార్టీకి బలగం ప్రజలు, కార్యకర్తలేనని ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొడంగల్ మండలంలోని రుద్రారం గ్రామంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యర్తల ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్‌ఎ్‌సపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.