Chinna Jeeyar Ashram : ‘ఆంధ్రజ్యోతి’ కథనం కలకలం.. ‘విష్ణు లీలల’పై సర్వత్రా చర్చ.. జీయర్‌ ఆశ్రమంలో నిశ్శబ్దం

ABN , First Publish Date - 2023-06-11T03:42:47+05:30 IST

చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో.. ఆయన తర్వాత అంతటి కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్న ఆయన మేనల్లుడు విష్ణు స్వామిపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘విష్ణు లీలలు’ కథనం

Chinna Jeeyar Ashram : ‘ఆంధ్రజ్యోతి’ కథనం కలకలం.. ‘విష్ణు లీలల’పై సర్వత్రా చర్చ.. జీయర్‌ ఆశ్రమంలో నిశ్శబ్దం

(ఆంధ్రజ్యోతి, నిఘా విభాగం)

చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో.. ఆయన తర్వాత అంతటి కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్న ఆయన మేనల్లుడు విష్ణు స్వామిపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘విష్ణు లీలలు’ కథనం కలకలం రేకెత్తించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నిత్యం చినజీయర్‌ స్వామి వెన్నంటి ఉండే విష్ణుస్వామి మరో అవతారం బట్టబయలు కావడంతో ఆశ్రమ వర్గాలు నివ్వెరపోయాయి. ఆశ్రమంలో ఎంతో భక్తిశ్రద్ధలతో కనిపించే విష్ణుస్వామి బయట ఇలాంటి జీవితం గడుపుతారా? అని ఆశ్రమంలోని కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారూ ఈ వార్తపై ఎక్కువగా చర్చించుకున్నారు. కాగా.. ఈ వార్త నేపథ్యంలో శనివారం ఆశ్రమంలో నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. విష్ణుస్వామి వ్యవహారాలపై ఆశ్రమ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. శనివారం ఉదయం గంటన్నరపాటు జీయర్‌స్వామి సుదర్శనయాగంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ముభావంగా ఉన్నట్లు తెలిసింది. విష్ణుస్వామి వ్యవహారంపై మాట్లాడేందుకు ఆశ్రమవర్గాలు నిరాకరిస్తున్నాయి.

'Vishnu Swamy': గుడి ఎనకా నా సామి విష్ణు లీలలు


Updated Date - 2023-06-11T09:12:17+05:30 IST