Praveen Kumar: టీఎస్ పీఎస్సీ తీరు విడ్డూరం: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2023-06-24T01:47:41+05:30 IST

గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఓఎమ్‌ఆర్‌ షీట్లపై అభ్యర్థుల ఫోటోలు ముద్రించడానికి కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతాయనే ప్రింట్‌ చేయలేదని కోర్టుకి ..

 Praveen Kumar: టీఎస్ పీఎస్సీ తీరు విడ్డూరం: ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఓఎమ్‌ఆర్‌ షీట్లపై అభ్యర్థుల ఫోటోలు ముద్రించడానికి కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతాయనే ప్రింట్‌ చేయలేదని కోర్టుకి టీఎ్‌సపీఎస్సీ చెప్పడం విడ్డూరంగా ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పొదుపు చర్యల్లో భాగంగానే బయోమెట్రిక్‌ విధానాన్ని కూడా అమలు చేయలేదని టీఎ్‌సపీఎస్సీ పేర్కొనడం బాధ్యతరాహిత్యమని ట్విటర్‌లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎ్‌సపీఎస్సీ ఉన్నది పరీక్షలు నిర్వహించడానికా? ఖర్చుల లెక్కలు వేయడానికా? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-06-24T03:37:48+05:30 IST