‘సురక్షా’ సందడి
ABN , First Publish Date - 2023-06-05T00:21:23+05:30 IST
పోలీసు శాఖకు చెందిన వాహనాలు నగరంలో చక్కర్లు కొట్టాయి. పెట్రోకార్, బ్లూకోల్ట్, అగ్నిమాపక వాహనాలు, షీటీం, భరోసా, ఏహెచ్‌టీయూ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన వాహనాలతో పోలీసు సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.

పోలీసు వాహనాల భారీ ర్యాలీ
పోలీసు కమిషనరేట్ నుంచి ప్రారంభం
జెండా ఊపి ప్రారంభించిన చీఫ్‌విప్
పాల్గొన్న సీపీ, కలెక్టర్, కమిషనర్
హనుమకొండ క్రైం, జూన్ 4: పోలీసు శాఖకు చెందిన వాహనాలు నగరంలో చక్కర్లు కొట్టాయి. పెట్రోకార్, బ్లూకోల్ట్, అగ్నిమాపక వాహనాలు, షీటీం, భరోసా, ఏహెచ్‌టీయూ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన వాహనాలతో పోలీసు సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. హనుమకొండ నుంచి ప్రారంభమైన ర్యాలీ వరంగల్, ధర్మారం, ఓసిటీ, మామునూరు, హంటర్‌రోడ్డు, కాజీపేట ప్రాంతాల మీదుగా ర్యాలీ సాగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వరంగల్ పోలీసు కమిషనరేట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, సీపీ రంగనాథ్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషాలు సంయుక్తంగా పోలీసు వాహనాలతో కూడి భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖలను సమన్వయంతో ముందుకు నడిపిస్తూ ప్రగతికిదారులు వేస్తున్నారని అన్నారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు అబివృద్ధితో ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు. వ్యూహాత్మకమైన మార్పులతో ప్రజల వద్దకు పాలన అనే విధంగా సక్సెస్ బాటలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడని కొనియాడారు. పోలీసుశాఖలో కూడా అనేక మార్పులు తీసుకురావడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. హోంగార్డులకు సైతం అవసరమైన మౌలిక సదుపాయాలు, జీతం ఇస్తున్నది ఒక్క బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడు తూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింద న్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, భరోసా పెరిగిందని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసు శాఖ సురక్ష దినోత్సవాన్ని నిర్వహిం చిందన్నారు. తొమ్మిదేళ్ల అభివృద్ధి కార్యక్రమాలకు సురక్ష ఒక వేదికలా నిలుస్తుందన్నారు. పోలీసులు సామాన్య ప్రజలకు ఫ్రెండ్లీగా.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. షీటీమ్స్, భరోసా విభాగానికి పోలీసు శాఖ పెద్ద పీట వేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ అధికారి అంకిత్‌కుమార్, ట్రెయినీ ఐఏఎస్ అధికారి శద్దాశుక్లా, రీజినల్ ఫైర్ అధికారి పాపయ్య, సెంట్రల్‌జోన్, ఈస్ట్‌జోన్ డీసీపీలు భారీ, కరుణాకర్, అదనపు డీసీపీ సంజీవ్, సురేష్‌కుమార్, ఎస్‌బీ ఏసీపీ తిరుమల్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డిలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ పోలీసులు భేష్
వారి సేవలు వెలకట్టలేనివి..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కమిషనరేట్ కార్యాలయంలో సురక్షా దినోత్సవం
హనుమకొండ క్రైం, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర పోలీసుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. న్యూయార్క్ పోలీసులకు మించి తెలంగాణ పోలీసు లు పని చేస్తున్నారని అన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాల యంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. తన 40 యేళ్ల రాజకీయ జీవితంలో పోలీసు శాఖలో ఇంత అభివృద్ధి ఎన్నడూ చూడలేదన్నారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనని గుర్తు చేశారు. గతంలో పోలీసులు స్వేచ్ఛగా తిరగాలంటేనే భయపడేవారని, ఇప్పుడు స్వరాష్ట్రంలో భయంలేకుండా జీవిస్తున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పని చేస్తున్న కాలంలో పర్వతగిరి పోలీసుస్టేషన్‌ను నిర్మించామని, అదే పోలీసుస్టేషన్ నమూనా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో రాష్ట్రంలో గుండా లు, రౌడీలు రాజ్యం ఏలుతుండేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశాం తత నెలకొందని అన్నారు. పోలీసులకు వాహనాలు లేక ప్రైవేటు జీపుల ను ఆశ్రయించేవారని, ఇప్పుడు ప్రతీ పోలీసుస్టేషన్‌కు అధునాతన వాహ నాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సైబర్‌క్రైం డాటా తెఫ్ట్ కేసును గవర్నమెంట్ ఆఫ్ ఇండి యా ఛేదించలేదని, హైదరాబాద్ పోలీసులు ఛేదించి పేరు సంపాదించా రన్నారు. వరంగల్ సీపీగా రంగనాథ్ చేస్తున్న సేవలు బాగున్నాయని, ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయన్నారు. సీపీ పేదప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తుగా ప్రజలందని తరుపున ఘనంగా సన్మానిస్తున్న ట్టు శాలువా, బొకేతో సత్కరించారు. సయ్యద్ మగ్ధూం బృందం చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోలీసు కుటుంబాలు కళాకారుల ఆటాపాటలకు తరలించిపోయారు. వరంగల్ సీపీ రంగనాథ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్‌రాజు, జిల్లా పరిషత్ చైర్మెన్ సుధీర్‌కుమార్, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్, గండ్ర జ్యోతి, వరంగల్ మున్సిపల్ మేయర్ రిజ్వానా బాషా, డీసీపీలు దాసరి మురళీధర్, అబ్దుల్ భారీ, కరుణాకర్‌లతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.