చేనేత సమస్యలను విస్మరించిన ప్రభుత్వం: సురేఖ

ABN , First Publish Date - 2023-02-11T23:43:30+05:30 IST

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమ స్యలను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ 23వ డివిజన్‌లో శనివారం హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించారు. గోపాలస్వామిగుడి చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభించి డివిజన్‌లో ఇంటింటికి, చేనేత సంఘాలకు తిరుగుతూ మాజీ సురేఖ ప్రజల సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ కొత్తవాడలోని చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తానన్నారు. తాను ప్రాతినిధ్యం

చేనేత సమస్యలను విస్మరించిన ప్రభుత్వం: సురేఖ
చేనేత కార్మికులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొండా సురేఖ

పోచమ్మమైదాన్‌, ఫిబ్రవరి 11: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమ స్యలను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ 23వ డివిజన్‌లో శనివారం హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించారు. గోపాలస్వామిగుడి చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభించి డివిజన్‌లో ఇంటింటికి, చేనేత సంఘాలకు తిరుగుతూ మాజీ సురేఖ ప్రజల సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ కొత్తవాడలోని చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తానన్నారు. తాను ప్రాతినిధ్యం వహించినప్పుడు చేనేత కార్మికులకు బకాయిలు లేకుండా సక్రమంగా బిల్లులు చెల్లించేలా కృషి చేశానని, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడానని తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నిధులు ఎంత... జరు గుతున్న అభివృద్ధి ఏది అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రతి కార్మికుడికి న్యాయం జరిగిందని, బీఆర్‌ఎస్‌ పాలనలో మధ్య తరగతి బతుకులు ఆగం అవుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయ కులు చిప్ప వెం కటేశ్వర్లు, దామెర సర్వేష్‌, నల్గొండ రమేష్‌, మడిపెల్లి కృష్ణగౌడ్‌, మీసాల ప్రకాశ్‌, రేణుకుంట్ల శివ, హైదర్‌, దొంతుల రాజేష్‌, బాసాని కరుణాకర్‌, బత్తిని వినోద్‌, శ్రీల త, దాసరి రాజేష్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలను కలిసిన సురేఖ

కొత్తవాడలో జరిగిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో ఆసక్తికర విషయం జరిగిం ది. యాత్రలో సురేఖ బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నాయకులు యెలుగం లీలావతి-సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. సురేఖను చూడగాను వారు ఆత్మీయంగా పలకరించడంతో వారి ఇంట్లోకి వెళ్లి కూర్చోని కొంతసేపు ముచ్చటిం చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదటి కార్పొరేటర్‌ టికెట్‌ మీకే కేటాయించా నని సురేఖ గుర్తు చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌, మాజీ ‘కుడా’ డైర క్టర్‌ యెలుగం శ్రీనివాస్‌ ఇంట్లోకి వెళ్ళి కూర్చోని కొంత సేపు మాట్లాడారు. కొండా సురేఖ బీఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడటం చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-02-11T23:43:32+05:30 IST