Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది
ABN , First Publish Date - 2023-10-16T16:02:40+05:30 IST
నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ (Congress Party) టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యత వహించాలని మాజీమంత్రి (Ex Minister) నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, ముష్టిపల్లిలో చింతలపల్లి జగదీశ్వర్ రావు (Chintalapalli Jagadishwar Rao), అసమ్మతి నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) గెలిస్తే పార్టీ మారరని చెప్పారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రాకపోతే వచ్చేవాళ్ళు కాదని, జూపల్లి అవకాశవాదని, కోవర్టని విమర్శించారు. టికెట్లు ఇవ్వకుండా అవమానం చేశారని బుద్ధి చెపుతామన్నారు.
పార్టీలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు అండగా ఉంటామని, కలిసి పోరాటం చేస్తామని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పొన్నాల లక్ష్మయ్యను, బీసీ కులాన్ని రేవంత్ రెడ్డి అవమానించారన్నారు. కెఎల్ఐ ప్రాజెక్ట్ మోటార్లు పని చేయకుండా చేసింది జూపల్లి కృష్ణారావు అని అన్నారు. చింతలపల్లి జగదీశ్వర రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోసం చేశారని, జూపల్లిని ఓడించి బుద్ధి చెపుతామని అన్నారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని, తినే అన్నంలో జూపల్లి మట్టి పోశారని జగదీశ్వర రావు మండిపడ్డారు.