COLLECTOR: ఉపాధి నిధులతో అటవీశాఖలో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:13 AM
ఉపాధి హామీ పథకం నిధులతో అటవీశాఖలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. మొక్కలు నాటడం, నగరవన సుందరీకరణ తదితర అంశాలపై కలెక్టర్ మంగళవారం జిల్లా అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
పుట్టపర్తి టౌన, డిసెంబరు17(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం నిధులతో అటవీశాఖలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. మొక్కలు నాటడం, నగరవన సుందరీకరణ తదితర అంశాలపై కలెక్టర్ మంగళవారం జిల్లా అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విజన 2040కి అనుగుణంగా అటవీశాఖ లక్ష్యాలు సాఽధించాలన్నారు. 2025-26లో 35లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎ్‌ఫఓ చక్రపాణి, సామాజిక వనవిభాగ అధికారి వినోద్‌కుమార్, సబ్ డీఎ్‌ఫఓ ఆనంద్ పాల్గొన్నారు.
ఇంధన పొదుపుపై ర్యాలీ: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లోభాగంగా మంగళవారం పుట్టపర్తిలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ చేతన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్టీసి బస్టాండు వరకు అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే పోస్టర్లు, ప్రచార సామగ్రిని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుతశాఖ ఎస్‌ఈ సురేంద్ర, సంబంఽధిత అఽధికారులు పాల్గొన్నారు.