KRISHNASHTAMI : కృష్ణాష్టమికి ఆలయాలు ముస్తాబు
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:10 AM
మండల వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలకు ఆల యాలను ఆదివారం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. గోరంట్లలోని మాధవ రాయదేవాలయం, మేరెడ్డిపల్లి, కొండాపురంలోని వేణుగోపాలస్వామి ఆల యాలను మామిడి తోరణాలు, విద్యుత దీపాలతో అలంకరించారు. మాధవ రాయ ఆలయంలో మొదటిసారి వేడుకలు నిర్వహించ తలపెట్టారు. స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రా వాలని ఆలయకమిటీ వారు కోరారు.
గోరంట్ల, ఆగస్టు 25: మండల వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలకు ఆల యాలను ఆదివారం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. గోరంట్లలోని మాధవ రాయదేవాలయం, మేరెడ్డిపల్లి, కొండాపురంలోని వేణుగోపాలస్వామి ఆల యాలను మామిడి తోరణాలు, విద్యుత దీపాలతో అలంకరించారు. మాధవ రాయ ఆలయంలో మొదటిసారి వేడుకలు నిర్వహించ తలపెట్టారు. స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రా వాలని ఆలయకమిటీ వారు కోరారు. అలాగే పలు పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాసవీ ధర్మశాలలో వేడుకలు
హిందూపురం అర్బన: ఇస్కాన, బెంగళూరు వారి హరే కృష్ణ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని వాసవీ ధర్మశాలలో శ్రీకృష్ణ జన్మాష్ట మి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన హరేకృష్ణ బృందం పేర్కొంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఉదయం 7 గంటల నుంచి 8.30 వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుంచి 8.30 వరకు అభి షేకాలు ఉంటాయన్నారు. ఉత్తర ప్రదేశలోని మధు ర నుంచి చిన్ని కృష్ణుడి విగ్రహం తీసుకొచ్చి ఊరేగిస్తామన్నారు. ఆ విగ్రహానికి భక్తులు అభిషేకం చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అదే విధంగా ఉయ్యాల సేవ, హారతి, మ హాప్రసాదం వినియోగం ఉంటాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పరమాత్ముడి కృపకు పాత్రులు కావలెనని బృందం సభ్యులు కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....