AP Govt : పోషణ్ 2.0 పథకానికి 169 కోట్లు విడుదల
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:44 AM
అంగన్వాడీల్లో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించే ‘పోషణ్ 2.0’ పథకానికి
అమరావతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల్లో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించే ‘పోషణ్ 2.0’ పథకానికి ప్రభుత్వం రూ.169.65 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికిగానూ ఈ నిధులు విడుదల చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.