Share News

Heavy Rains: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 13 , 2024 | 01:49 PM

ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితర ఆవర్తనాలు ఏర్పాడ్డాయని విపత్తు నిర్వహాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Heavy Rains: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

అమరావతి, అక్టోబర్ 13: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితర ఆవర్తనాలు ఏర్పాడ్డాయని విపత్తు నిర్వహాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. ఈ రోజు కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందన్నారు.

Also Read::16న సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..!


ఈ నెల 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అదే సమయంలో కోస్తా తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటలల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి జల్లు కురిసే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహాణ శాఖ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read:: మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య.. స్పందించిన రాహుల్ గాంధీ


రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లతోపాటు హెల్ప్ లైన్‌లు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఇక మత్స్యకారులు ఎవరు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

Also Read: కూతురుని చంపాలనుకున్న తల్లి.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన లవర్..

Also Read: ఏపీకి భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల


మరోవైపు ఇదే అంశంపై ఆదివారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. అలాగే విపత్తు నిర్వహాణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సైతం.. భారీ వర్షాల వేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అదే విధంగా హెల్ప్ లైన్ నెంబర్లను సైతం ఆయన వివరించారు.

Also Read: మునక్కాయతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

Also Read : అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 13 , 2024 | 01:55 PM