జిల్లాలో అకాల వర్షం
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:29 PM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడుకున్న వర్షం కురిసింది. పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది.

పెద్దపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడుకున్న వర్షం కురిసింది. పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. పెద్దపల్లి పట్టణంలో 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలాయి. వరి పంట ఇప్పుడిప్పుడే కంకులు వేస్తోంది. అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. (మిగతా 8వ పేజీలో)
పెద్దపల్లి రూరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం వడగళ్ల వానతో రైతన్నలకు కడగళ్లను మిగిల్చింది. ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురవడంతో పొట్ట దశలో ఉన్న ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. హన్మంతునిపేట, పెద్దకల్వల, నిట్టూరుతో పాటు పలు గ్రామాల్లో వడగండ్లకు గొలుసు నేల రాలింది. వర్షంతో పాటు వీచిన గాలికి కొన్ని ప్రాంతాల్లో పంటలు నేలకొ రిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు చిట్లిపోవ డంతో మిగిలేది తాలు మాత్రమేనని రైతులు ఆందో ళన చెందుతున్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): భూపతిపూర్ చెరు వు గట్టుపై ఉన్న తాటి చెట్టుపై శుక్రవారం సాయం త్రం 6.30 గంటల ప్రాంతంలో పిడుగు పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమా దం తప్పింది. నారాయణపూర్‌తోపాటు పలు గ్రామా ల్లో వడగండ్ల వాన కురిసింది. పట్టణంతో పాటు పలు గ్రామాలలో పలుచోట్ల వర్షాలు కురిసాయి. ఎక్కువగా ఈదురుగాలులను సుడిగాళ్లు వీయడంతో ప్రజలు వెంటనే ఇళ్లల్లోకి వెళ్లిపోయారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): ఽధర్మారం మండలంలో భారీ వర్షం కురిసింది. వేడి నుంచి ఉపశమనం పొం దిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బంజేరుపల్లి గ్రామంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. మండల కేంద్రంలో గంట పాటు భారీ వర్షం పడడంతో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. శుక్ర వారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృ తమైంది. భారీగా ఈదురుగాలులు వీస్తూ వర్షం కురి సింది. పొలాలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మంథని, (ఆంధ్రజ్యోతి): మంథని ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురి సింది. విద్యుత్‌సరఫరాలో పలు మార్లు అంతరాయం కల్గింది. అకాల వర్షం కారణంగా పొట్ట దశలో ఉన్న వరి పంటలు, మిర్చి పంటలు దెబ్బ తినే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కళ్యాణ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పట్టణం లో కారుమబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే రామగుండం పారిశ్రామిక ప్రాం తంలో వాతావరణం చల్లగా మారింది. సాయంత్రం వర్షం కురవడంతో నిన్నటి వరకు ఎండ, ఉక్కపోతతో ఉన్న పారిశ్రామిక ప్రాంతం చల్లగా మారింది.