Share News

నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:31 PM

ఎల్‌ఆర్‌ ఎస్‌ దరఖాస్తులను నెలాఖరులోగా పూర్తిగా పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రధా న కార్యదర్శి ఎం దానకిషోర్‌ అన్నారు. శుక్ర వారం కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించిన అభ్యర్థులకు క్రమబద్ధీకరణ మంజూరు పత్రాలు వెంటనే అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.

నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

పెద్దపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ ఎస్‌ దరఖాస్తులను నెలాఖరులోగా పూర్తిగా పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రధా న కార్యదర్శి ఎం దానకిషోర్‌ అన్నారు. శుక్ర వారం కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించిన అభ్యర్థులకు క్రమబద్ధీకరణ మంజూరు పత్రాలు వెంటనే అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా వస్తున్న నూతన లేఔట్‌ క్రమ బద్దీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరి శీలించి అర్హత గల దరఖాస్తుల క్రమబద్ధీక రణ చేపట్టాలన్నారు.

లేఔట్‌ క్రమబద్ధీకరణ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి ఫీజుతోపాటు ఓపెన్‌ స్పేస్‌ చారీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజులు 90 శాతం రిఫండ్‌ అవు తుందని, 10 శాతం ప్రాసెసింగ్‌ కోసం తీసు కుంటామన్నారు. 2020 ఆగస్టు 26 వరకు 10 శాతం ప్లాట్లు విక్రయించిన లే ఔట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు.కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ రిజి స్టర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:31 PM

News Hub