Share News

భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:28 PM

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో మరింత వేగం పెంచా లని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదే శించారు.

భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో మరింత వేగం పెంచా లని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ రెవెన్యూ, నీటిపారుదల శాఖ, మునిసిపల్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తి పోతల పథకంలో భాగంగా ఉట్కూర్‌ మండ లంలోని దంతెన్‌పల్లి గ్రామంలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచించారు. అలాగే కోస్గి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్‌ చర్చించారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ డీఈ రాములు, కోస్గి తహసీల్దార్‌ బక్క శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు తదితరులున్నారు.

ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి

ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం నవంబరు నుంచి ఈ నెల 20 వరకు నూతన ఓటరు నమోదుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ఫారం-6 ద్వారా 1,294 దరఖాస్తులు రాగా 1,068 విచారణ పూర్తయ్యిందన్నారు. ఫారం-7కు 169 దరఖాస్తులు రాగా 141 విచారణ చేయగా, 8 పెండింగ్‌ ఉన్నాయని తెలిపారు. చిరునామా మార్పునకు 1,529 దరఖాస్తులు వచ్చాయ న్నారు. వాటిలో 1,359 విచారణ పూర్తి కాగా, 71 పెండింగ్‌లో ఉన్నాయని, మిగతావి తిరస్కరణకు గురయ్యాయని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం తెలిపారు. మక్తల్‌ నియోజకవర్గంలో ఫారం-6 ద్వారా 1,690 దరఖాస్తులు రాగా, 1,269 విచారణ పూర్తయ్యిందని, 147 పెండింగ్‌ ఉన్నాయని తెలిపారు. ఫారం-7 ద్వారా 332 దరఖాస్తులు రాగా, 233 విచారణ పూర్తి కాగా, 26 పెండింగ్‌లో ఉన్నాయని, చిరునామా మార్పు కోసం 1,908 దరఖాస్తులు రాగా 1,625 వి చారణ పూర్తయి, 156 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగితావి తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓ టరు జాబితా తయారీ కోసం రిటర్నింగ్‌ అధికారి ప్రతీ వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌ స్థా ుు ఏజెంట్లను నియమించి, జాబితా అందజేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో రాంచందర్‌నాయక్‌, డీటీ బాల్‌రాజ్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అఖిలప్రసన్న, రాణిదేవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్‌రెడ్డి, పోషల్‌ వినోద్‌, సీలం, వెంకట్‌రాంరెడ్డి, అశోక్‌, అజయ్‌, వెంకటేష్‌, తాహిర్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:28 PM