Vishnukuamr Raju: పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్
ABN , Publish Date - Feb 17 , 2024 | 11:41 AM
Andhrapradesh: పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటిస్తారన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు (AP BJP Former MLA Vishnukumar raju) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) ప్రకటిస్తారన్నారు. ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గురించి ఇప్పుడు అందరికీ తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) 2019లో దొంగ వాగ్దానాలు ఇచ్చారని.. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే 2024లో ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పారని గుర్తుచేశారు. చీప్ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలను బలి గొంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి నైతిక హక్కు ఉందని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారన్నారు. నెలకు 1000 రూపాయలు చొప్పున కరెంటు బిల్లుల రూపంలో రాష్ట్ర ప్రజల నుండి దోపిడీ జరుగుతోందన్నారు. ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లుల ద్వారా 60 వేల రూపాయలు ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని ఆరోపించారు.
జగన్ ఎప్పుడూ అదే ఆలోచన...
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరానికి మద్యంలో 30 వేల కోట్లు అవినీతికి పాల్పడుతుందన్నారు. ప్రతి పనిలో దోపిడీ చేస్తున్నారన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు ల్యాండ్ ఇవ్వమని అడిగితే పనికిరాని ల్యాండ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రముఖ పీఠాధిపతికి మాత్రం మంచి స్థలం కేటాయించారన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు మంచి పాలన అందించాలని లేదు ఎంతవరకు దోపిడీ చేయాలని ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడిగేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇక అంతే...
తిరుపతి బై ఎలక్షన్‌లో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో అందరికి తెలుసన్నారు. దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత చర్యలు తీసుకున్నారన్నారు. దీనిలో అవినీతికి పాల్పడిన వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందన్నారు. వ్యక్తులను మేనేజ్ చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే... ప్రజలు రాష్ట్రానికి ఉరేసినట్లే అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో కూర్చునే స్థానాలు కూడా రావన్నారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకోవాలని జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు తర్వాత అసెంబ్లీలో జగన్ అడుగుపెట్టడని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...