Vijayanagaram: యువతిపై కత్తితో దాడి
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:04 AM
విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు

విజయనగరం జిల్లాలో ఘటన
గరివిడి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో శనివా రం ఓ యువతిపై యువకుడు కత్తితో విచక్షణారహితంగా చేసిన దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. కడుపులో రెండుసార్లు పొడిచినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బూర్లె ఆదినారాయణగా పోలీసులు గుర్తించారు. ఆదినారాయణతోపాటు అతనికి సహకరించిన మరో ము గ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 18 ఏళ్ల కోండ్రు అఖిల ఇంటర్ ఫస్టియర్ చదివింది. ఆ తర్వాత చదువు ఆపేసి, ఇంటి వద్ద ఉంటోం ది. అదే గ్రామానికి చెందిన బూర్లె ఆదినారాయణ (23), అఖిల స్నేహంగా ఉండేవారు. గత కొన్ని రోజు ల నుంచి వీరి మధ్య స్నేహం చెడింది. దీంతో ఆ యువకుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అఖిల శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి పనులు చేసుకొనేందుకు తమ పెరట్లోకి వెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఆదినారాయణ ఆమెపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగు ధరించాడు. తీవ్ర గాయాలతో, రక్తపుమడుగులో ఉన్న అఖిల పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను 108 వాహనంలో చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ వకుల్ జిందాల్, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ.. కేసు మిస్టరీ ఛేదించేందుకు 5 ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. అఖిల తండ్రి తోటనాయుడు, తల్లి సత్యవమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News