CS Neerab Kumar : అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో న్యాయం చేయాలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:47 AM
రాష్ట్రంలో అగ్రి గోల్డ్ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.

అవసరమైన చర్యలు తీసుకోండి.. అధికారులకు సీఎస్ ఆదేశం
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అగ్రి గోల్డ్ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అగ్రి గోల్డ్ ఆస్తులపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అగ్రి గోల్డ్ బాధితులు పొగొట్టుకున్న ఆస్తులను వారికి తిరిగి చేర్చే విధంగా కేసుల సత్వరం పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ, తదితర విభాగాల అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అగ్రి గోల్డ్ మోసానికి సంబంధించి మొత్తం 23 జీవోలను విడుదల అయ్యాయని తెలిపారు. ఈ కేసు 9 రాష్ట్రాలతో ముడిపడి ఉందని, 19,18,865 మంది డిపాజిట్‌దారుల నుంచి మొత్తం రూ. 6,380 కోట్ల వరకు వసూలు చేశారని వివరించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.