Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:51 PM
Andhrapradesh: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వంశీకి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. 2019 లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడ, ఫిబ్రవరి 2: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు (Gannavaram MLA Vallabhaneni Vamshimohan) అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వంశీకి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. 2019 లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు వంశీమోహన్ గైర్హాజరయ్యారు. దీంతో గత విచారణలోనే బెయిలబుల్ వారెంట్‌ను న్యాయస్థానం జారీ చేసింది. అయితే నేటి విచారణకు కూడా వంశీ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో వంశీమోహన్‌పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను అమలు చేయాలని పోలీసులను ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.
కాగా.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూతు వద్ద జరిగిన ఘటనలో 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...