Share News

నేడు ఓటెత్తండి!

ABN , Publish Date - May 13 , 2024 | 12:51 AM

మీ ఓటే వజ్రాయుధం.. ఒక్కసారి నొక్కితే ఐదేళ్లు మిమ్మల్ని పాలించే అవకాశం..ఆ అవ కాశాన్ని జారవిడుచుకోవొద్దు..మీ తెగువ చూ పండి.. మీకు నచ్చిన.. మీరు మెచ్చిన అభ్యర్థిని ఎన్నుకోండి.

నేడు ఓటెత్తండి!
ఈవీఎం మిషన్‌పై సిబ్బందికి అవగాహన

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మీ ఓటే వజ్రాయుధం.. ఒక్కసారి నొక్కితే ఐదేళ్లు మిమ్మల్ని పాలించే అవకాశం..ఆ అవ కాశాన్ని జారవిడుచుకోవొద్దు..మీ తెగువ చూ పండి.. మీకు నచ్చిన.. మీరు మెచ్చిన అభ్యర్థిని ఎన్నుకోండి..ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. దీనినే ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. ఇది డెమోక్రటియా అనే గ్రీకు పదం నుంచి వచ్చిం ది. డెమోస్‌ అంటే ప్రజలు.. క్రాటోస్‌ అంటే పరిపాలన అని అర్థం. ‘అందరూ స్వాతంత్య్రం అనుభవించడం, ప్రతి ఒక్కరూ సమానం’ ఇవి ప్రజాస్వామ్య ముఖ్య నియమాలు. మరి ఇవి నెరవేరాలంటే ఒకే ఆయుధం ‘ఓటు’. ఈ హక్కు వినియోగించుకునే రోజే ‘పోలింగ్‌ రోజు (ఈరోజు). అయితే అంతటి విలువైన ఓటుపై నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఐదేళ్ల పాటు ఇబ్బం దులకు గురవుతున్నారు.పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని జార విడుచుకొని బేజారవుతున్నా రు.నోట్లు, బహుమతులు వంటి వాటి కి లొంగి అనుభవం లేని వాళ్లను, దగా కోర్లను నెత్తిన ఎక్కించుకొని నలిగిపోతున్నారు.దీనికి ఈ సారి స్వస్తి పలుకుదాం.ఓటుపై అలిగితే రాజ్యాంగం ఇచ్చిన మహత్తర అవకాశాన్ని జార విడుస్తున్నట్టే.. లెగండి.. పదండి..ఓటెత్తండి. మన ఆకాంక్ష లను నెరవేర్చే నాయకులను పాలకులుగాచేసుకుందాం. మరో ఐదేళ్లు యాతన పడకుండా జా గ్రత్త పడదాం.ప్రజాస్వామ్యం ఓడిపోకుండా ఓటుతో కాపాడుకుందాం.

వారి తీరు గర్హనీయం

జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలైన రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో గత రెండు దఫాల్లో(2014, 2019) ఓటింగ్‌ 90 శాతం దాటలేదు.సరాసరి చూస్తే 2014లో 81.90 శాతం, 2019లో 81.53 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. ఓటు వేయని సు మారు 18 శాతం మంది ఇంటికే పరి మితమయ్యారు. పోలింగ్‌ రోజున ఓటు వేయడా నికి ఎన్నికల సం ఘం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. కానీ లక్షల మంది ఓటింగ్‌కి దూ రమై ప్రజాస్వామ్యాన్ని అప హా స్యం చేస్తున్నారనడంలో సందే హం లేదు. జిల్లాలోని రాజమ హేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలు మే ల్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. గత రెండు దఫాల ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఇక్క డే అతి తక్కువ ఓటింగ్‌ నమోదైంది. గ్రా మా ల్లో ప్రజలు చైతన్యంతో ఉంటే నగర ప్రజలు ఓటు చులకనగా చూస్తున్నారనే వాదన ఉంది.

2014,2019 ఎన్నికల్లో పోలింగ్‌

నియోజకవర్గం 2014 2019

రాజమహేంద్రవరం సిటీ 69.47 66.19

రాజమహేంద్రవరం రూరల్‌ 73.97 74.21

కొవ్వూరు 85.28 86.46

నిడదవోలు 85.72 82.70

గోపాలపురం 86.96 85.92

అనపర్తి 85.98 87.44

రాజానగరం 85.93 87.83

సరాసరి 81.90 81.53

ప్రతి ఒక్కరూ ఓటెయ్యాలి : కలెక్టర్‌

ఓటేయడం మన సామాజిక బాధ్యత. నేనూ ఓటేస్తున్నా. కంబాలపేటలోని ఆనందరీజెన్సీ ఎదురుగా ఉన్న చున్నీ లాల్‌ జాజు రోటరీ మునిసిపల్‌ కార్పొ రేషన్‌ స్కూల్‌లో నాకు ఓటు ఉంది. ఎన్నికలనేవి ప్రజాస్వామ్య పండుగ. సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాల యాలన్నింటికీ సెలవు.ప్రతి ఒక్కరూ ఓటెయ్యాలి. పోలింగ్‌ ముగిసే సమ యానికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేయడానికి అనుమతి ఉంటుం ది.జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉంది. పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు నిషేధించాం. శనివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ 48 గంటలు ఎక్కడా మద్యం అమ్మకాలు లేకుండా నిషేధిం చాం. జిల్లాలో 164 ప్రాంతాల్లో 375 క్రిటికల్‌ పోలింగ్‌ కేం ద్రాలు ఉన్నాయి. జిల్లాలో 434 మంది మైక్రో అబ్జర్వర్లు, 151 మంది సెక్టార్‌ అధికారులు, 151 రూట్‌ అధికారులు ఉన్నారు.24 ఎంసీసీ బృందాలు, 67 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 69 గణాంకాల బృందాలు 24 వీడియో సర్వే లెన్స్‌ బృందాలు, 25 వీడియో చిత్రీకరణ బృందాలు, 16 అకౌంటింగ్‌ బృందాలు ఉన్నాయి. ఏ సమస్య తలెత్తినా జిల్లా కంట్రోలు రూమ్‌ 18904252540 టోల్‌ప్రీ నెం బర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలి.. ఓటర్ల సమాచారానికి 1950 నెంబరులో సంప్రదించవచ్చు. ఓటర్లు 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయవచ్చు.

పక్కాగా బందోబస్తు : ఎస్పీ జగదీశ్‌

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే సన్నద్ధత మొద లుపెట్టాం.పక్కా ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేశాం. శాంతియుతంగా పోలింగ్‌ జరగడానికి అన్ని ఏర్పాట్లూ చేశాం.. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు పెట్టి ఇప్పటి వరకూ రూ.23 కోట్ల విలువ చేసే బంగారం, నగదు, మద్యం, ఫ్రీబీస్‌ను సీజ్‌ చేశాం. ఓటరుకు రక్షణ అవసరమైతే ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ రూం నెం.0883 2441480కి లేదా డయల్‌ 100, 112కి ఫోన్‌ చేస్తే నిమి షాల్లో వారి వద్దకు చేరుకుంటాం. లేదా దగ్గరలోని పోలీసులను సంప్రదించాలి. జిల్లాలో 1700 మంది పోలీసులు, 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశాం.ఇప్పటికే 1098 మంది రౌడీషీట ర్లను, 173 మంది గత ఎన్నికల్లో నిందితులు /నేరస్తులను బైండోవర్‌ చేశాం. 178 లైసెన్సుడు వెపన్స్‌ స్వాధీనం చేసుకున్నాం.నేను 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌.ఎస్పీగా సార్వత్రిక ఎన్నికల్లో ఒక జిల్లా బాధ్యతలు చూడడం తొలిసారి. మా అధికారులు, సిబ్బందితో పూర్తి సమన్వ యంతో ఎన్నికలకు సన్నద్ధమయ్యాం.

పోలింగ్‌కు సర్వం సిద్ధం

పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమ వారం ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు 1577 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఏడు నియోజకవర్గాల్లో 71 మంది పోటీపడుతున్నారు. ఎంపీ అభ్యర్థులు 12 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 16,169 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. జిల్లాలో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉన్నారు. మహి ళలు 8,30,735 మంది ఉండగా, పురుషులు 7,92,317 మంది, ఇతరులు 97 మంది ఉన్నా రు. వీరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు, హోం ఓటింగ్‌ను మినహాయిస్తే మిగతా వారంతా ఓటు వేయవలసి ఉంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత 40,509 మంది ఉన్నారు. సోమవారం ఉదయం 5.30 గం టలకే మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇది రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో అధికారులు నిర్వహిస్తారు. ప్రతి రెండు గంటలకు పోలింగైన ఓట్ల శాతాలు ప్రకటి స్తారు. పీడీఎంఎస్‌ యాప్‌ ద్వారా పీవో, ఏపీవోలు ప్రతి రెండుగంటలకు పోలింగ్‌ శాతాలు అప్‌లోడ్‌ చేస్తారు.

Updated Date - May 13 , 2024 | 12:51 AM