లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం
ABN , Publish Date - Sep 22 , 2024 | 11:49 PM
పిఠాపురం, సెప్టెంబరు 22: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో తయా రు చేసే లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగంపై విశ్వహిందూపరిషత్, భజరంగదళ్, హిందూసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పట్టణంలోని ఉ
పిఠాపురంలో వీహెచ్‌పీ, భజరంగదళ్ ఆందోళన
పిఠాపురం, సెప్టెంబరు 22: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో తయా రు చేసే లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగంపై విశ్వహిందూపరిషత్, భజరంగదళ్, హిందూసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో ఆదివారం ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. భజరంగదళ్, వీహెచ్‌పీ కాకినాడ జిల్లా కన్వీనర్లు వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్త, దాట్ల రాజు మాట్లాడుతూ జంతు కళేభరాల కొవ్వు ద్వారా వచ్చే నూనెతో తయారు చేసిన నెయ్యిని తిరుమల లడ్డూల్లో వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మ నోభావాలు దెబ్బతీశారని, దీని వల్ల భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. కల్తీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి కల్తీ జరగడానికి కారకులుగా గుర్తించినవారిని కఠినంగా శిక్షించాలన్నారు. లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించడంతో పాటు తిరుమల పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో చెల్లుబోయిన సతీష్, కొండెంపూడి శివ, శివబాల, అంకిరెడ్డి గౌరీ, కందా దేవి, కిషోర్, గుబ్బల రామకృష్ణ, పవన్, దత్తకుమార్, చిత్రాడ పవన్‌శర్మ, నాగేశ్వరరావు, గాయత్రి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.