CM Ramesh: ఎవర్నీ వదలను.. దాడి తర్వాత సీఎం రమేష్ మాస్ వార్నింగ్!
ABN , Publish Date - May 04 , 2024 | 10:44 PM
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్‌కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్‌లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..
అనకాపల్లి, ఆంధ్రజ్యోతి: అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్‌కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్‌లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాగా.. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు దౌర్జన్యం చేస్తూ బీజేపీ నేత గంగాధర్‌పై చెప్పుతో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలుసుకున్న కూటమి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రమేష్‌పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఎంపీ అభ్యర్థితో పాటు నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం.. సీఎం రమేష్ అరెస్ట్.. హై టెన్షన్!!
ఎవర్నీ వదలను..!
పోలీసుల తీరు దారుణంగా ఉందని సీఎం రమేష్ కన్నెర్రజేశారు. పరామర్శించడానికి వెళ్తే తను అడ్డుకున్న పోలీసులు.. తనపై దాడికి పాల్పడిన బూడి ముత్యాల నాయుడిని, కార్యకర్తలపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దాడి చేసిన వారంతా ఇసుక దోపిడీ, మైనింగ్ దందాలకు పాల్పడిన వారేనని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని రమేష్ హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని బీజేపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇవాళ మధ్యాహ్నం నుంచి మాడుగుల నియోజకవర్గంలో రచ్చ రచ్చగానే ఉంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా ముత్యాల నాయుడే చెప్పుతో కొట్టడం గమనార్హం. ఇక్కడే గొడవ మొదలై.. అరెస్టుల దాకా వెళ్లింది.