AP Elections: చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారు: కనకమేడల రవీంద్రకుమార్
ABN , Publish Date - May 04 , 2024 | 11:54 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నెలలు జైల్లో ఉన్న ఆర్ధికనేరస్తుడు సీఎంగా ఉన్నారన్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడని ఆయన అఫిడవిట్ చెప్తుందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు.
న్యూఢిల్లీ, మే 4: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan Reddy) టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Former MP Kanakamedala Ravindra Kumar) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నెలలు జైల్లో ఉన్న ఆర్ధికనేరస్తుడు సీఎంగా ఉన్నారన్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడని ఆయన అఫిడవిట్ చెప్తుందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. మళ్ళీ జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు, ప్రజల ఆస్తులు ఉండవని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓట్లు వేయాలని కోరారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా లేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ఏపీలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!
కుప్పంలో గొడవలకు అవకాశం...
ప్రజలను ఇబ్బందికి గురి చేసి ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షనర్లలను వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కుటిల బుద్ధితో వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్‌తో ఎన్నికలు జరిపించాలన్నారు. రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలని ఈసీ చెప్పిందని.. అందులో పులివెందుల, కుప్పం లేవన్నారు. కుప్పంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కుప్పంలో వైసీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులే కాకుండా కేంద్ర ఎన్నికల అధికారులు కూడా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని మాజీ ఎంపీ వినతి చేశారు.
AP Pension: పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధుల
బాబు, పవన్ సభలకుె ఇబ్బందులు...
ఏపీ లో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని గతంలో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం గత ఐదేళ్ల నుంచి చూశామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా కేసులు పెట్టారన్నారు. నోటిఫికేషన్ తర్వాత చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, అధికారులు అందరూ ఎన్నికల సంఘం అధీనంలో ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ కింద అధికారులు పని చేయకుండా జగన్ కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా జరపాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. వందల మంది వైసీపీ నేతలు.. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. రాజకీయ హత్యలకు కూడా వైసీపీ నేతలు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ప్రధాన మంత్రి సభ సజావుగా జరగకుండా చేశారన్నారు. పోలీసులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Elections 2024: మహిళలపై వైసీపీ నేతల అసభ్య ప్రచారం.. వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి ఈసీ ఆదేశాలు
AP Elections: మద్యం నిషేధంపై షర్మిల ‘నవ సందేహాలు’ ఇవే.. జగన్ సమాధానం ఏంటో?
Read Latest AP News And Telugu News