AP Elections 2024: పుట్టపర్తిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - May 07 , 2024 | 01:52 PM
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిన్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిలు ఓటింగ్ కేంద్రంలోకి వచ్చేశారు. ఇరువురు నేతలు బయటకు వెళ్లాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ కోరారు. వాళ్లు వెళ్తే మేము బయటకు వెళ్తామంటూ పరస్పరం టీడీపీ, వైసీపీ అభ్యర్థులు వాదనకు దిగారు.
అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిన్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిలు ఓటింగ్ కేంద్రంలోకి వచ్చేశారు. ఇరువురు నేతలు బయటకు వెళ్లాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ కోరారు. వాళ్లు వెళ్తే మేము బయటకు వెళ్తామంటూ పరస్పరం టీడీపీ, వైసీపీ అభ్యర్థులు వాదనకు దిగారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం కావడంతో పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగారు. ఇద్దరు నేతలను బయటికి వెళ్లాలని చేతులు ఎత్తి మరీ రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ వేడుకున్నారు. చివరకు ఎన్నికల అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు నేతలూ బయటకు వెళ్లిపోయారు.
BJP: బీజేపీకి తెలంగాణ టీడీపీ మద్దతు..
పోస్టల్ బ్యాలెట్లో పలు చోట్ల ఉద్రికత్తలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఉద్యోగులు నిబంధనలకు పాతరేసి సెల్‌ఫోన్ తీసుకుని మరీ పోలింగ్ బూతుల్లోకి వెళుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఫోటో తీసి ఎవరికైతే ఓటు వేశారో ఆ అభ్యర్థికి పంపిస్తే వారు డబ్బులిస్తారు. దీంతో సెల్‌ఫోన్‌ను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులే పోలింగ్ బూతుల్లోకి వెళుతున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చాలా ప్రశాంతంగా సాగిపోయేది. ఈసారి మాత్రం ఏపీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది.
ఇవి కూడా చదవండి...
AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!
Fact Check: బరితెగింపు.. ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ ప్రచారం..!
Read Latest AP News And Telugu News