Share News

YS Jagan: జగన్ నిజ స్వరూపం బట్టబయలు.. ఇంత దుర్మార్గమా..!?

ABN , Publish Date - May 05 , 2024 | 04:20 AM

తొలి స్వరూపం మరింత క్రూరం, ఘోరం! ఇప్పుడున్న చట్టమే రాక్షసమైతే... దీని మూలరూపమైన బిల్లు బ్రహ్మ రాక్షసం! బారెడు కోరలతో రూపొందించిన ఈ బిల్లుపై కేంద్రం ఒకటికి రెండుసార్లు మండిపడటంతో... ఆ కోరలను కాస్త అరగదీశారు! అంతే! ..

YS Jagan: జగన్ నిజ స్వరూపం బట్టబయలు.. ఇంత దుర్మార్గమా..!?

  • మీ భూమి... నా ఇష్టం!

  • ‘టైటిలింగ్‌ బిల్లు’లోనే బయటపడ్డ జగన్‌ స్వరూపం

  • బ్రహ్మ రాక్షసంగా టైటిల్‌ బిల్లు తొలి ప్రతి

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ - 2022.. (AP Land Titling Guarantee Act- 2022) రాష్ట్రంలోని రైతులను, భూ యజమానులను వణికిస్తున్న చట్టమిది! భూములను వివాదాస్పదం చేసి... దురాక్రమణదారులకు ‘చట్టప్రకారం’ ఊతమిచ్చే చట్టం! భూములను మింగేసే రాక్షస చట్టం! ఈ విషయం ఇప్పటికే అందరికీ స్పష్టమైంది. అసలు సంగతి ఏమిటంటే... దీని తొలి స్వరూపం మరింత క్రూరం, ఘోరం! ఇప్పుడున్న చట్టమే రాక్షసమైతే... దీని మూలరూపమైన బిల్లు బ్రహ్మ రాక్షసం! బారెడు కోరలతో రూపొందించిన ఈ బిల్లుపై కేంద్రం ఒకటికి రెండుసార్లు మండిపడటంతో... ఆ కోరలను కాస్త అరగదీశారు! అంతే! మిగిలిందంతా సేమ్‌ టు సేమ్‌!

  • కేంద్ర చట్టాలు బేఖాతరు చేస్తూ నిబంధనలు

  • రెండుసార్లు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం

  • రాజ్యాంగబద్ధమేనా? శాసన పరిధిలోనే ఉందా?

  • బిల్లు తీరుపై రాష్ట్రానికి చీవాట్లు, సూటి ప్రశ్నలు

  • కోరలు కాస్త తగ్గించి మూడోసారి కేంద్రానికి

  • ట్రైబ్యునళ్ల స్థానంలో ‘అధికారుల’ ద్వారా తీర్పులు

  • లాబీయింగ్‌ చేసి మరీ ఆమోదం పొందిన జగన్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘అసలు ఇది చట్టమేనా? రాజ్యాంగానికి లోబడే ఉందా? మీకున్న శాసన పరిధిలోనే రూపొందించారా? అన్నీ చూసుకునే మాకు పంపారా?’’ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నిలదీసిన వైనమిది! ఈ బిల్లును జగన్‌ (YS Jagan Mohan Reddy) సర్కారు అంత ఘోరంగా, దారుణంగా ఇంకా చెప్పాలంటే రాక్షసంగా రూపొందించిం ది. ఇది చూసి కేంద్రమే కంగుతింది. ‘ఇది రాష్ట్ర చట్టం కాదు. కేంద్ర చట్టం’ అని ఇప్పుడు జగన్‌, వైసీపీ పెద్దలు కబుర్లు చెబుతున్నారు. కానీ... ‘నేనే ఫస్ట్‌’ అని చెప్పుకొనేందుకో, భూ ములను భోంచేసేందుకో తెలియదుకానీ జగన్‌ దీనిపై అత్యుత్సాహం ప్రదర్శించారు. నీతి ఆయోగ్‌ వద్ద ముసాయిదా బిల్లు తయారయ్యేందుకు ఐదు నెలల ముందే... 2019 జూలైలో అ సెంబ్లీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లును ఆమోదించారు. ప్రజలతో, వారి మనోభావాలతో ఏమాత్రం సంబంధం లేకుం డా... తనకు తోచిన, తను అనుకున్న నిరంకుశ ధోరణిలో ఈ బిల్లును రూపొందించారు. కేంద్ర చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా ‘అంతా నా ఇష్టం’ అన్నట్లుగా బిల్లును త యారు చేశారు. అయితే, ‘భూమి’ ఉమ్మడి జాబితాలో ఉండటంతో, ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం తప్పనిసరైంది. ఆ దశలోనే కేంద్రం నుంచి చీవాట్లు పడ్డాయి. 2021, 2022లో కేంద్రం ఈ బిల్లును వెనక్కి పంపింది. ఐదు కేంద్ర ప్రభుత్వ చట్టాలను ధిక్కరించేలా, టైటిల్‌ చట్టమే దేశంలో ‘సుప్రీమ్‌’ అన్నట్లుగా ఈ బిల్లును రూపొందించినట్లు తేల్చింది. రాజ్యాంగానికి లోబ డే ఈ బిల్లును తయారు చేశారా అని కేంద్రం ప్రశ్నించింది. ‘అవుననుకుంటే... అదెలాగో వివరించండి’ అని ఆదేశించింది. జగన్‌ సర్కారు ముచ్చటగా మూడోసారి 2023లో ఈ బిల్లును కేంద్రానికి పంపింది. అప్పుడు కూడా కేంద్రంవెనక్కి పంపించే పరిస్థితి ఉండటంతో.. జగన్‌ ఢిల్లీలో అధికారుల ద్వారా లాబీయింగ్‌ చేయించి మరీ ఆమోదం పొందారు. అంతకుముందు కేంద్రానికి పంపిన బిల్లులోని అంశాలను పరిశీలిస్తే...

‘ట్రైబ్యునళ్ల’తో డీలింగ్‌

టైటిల్‌ చట్టంలో భాగంగా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌, టైటిల్‌ అప్పిలే ట్‌ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటికి సివిల్‌ కోర్టుల అధికారం అప్పగించాలని ప్రతిపాదించారు. అం తేకాదు.. ఈ ట్రైబ్యునళ్లు ‘సివిల్‌ ప్రోసీజర్‌ కోడ్‌-1908’కు అతీతమని, దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని బిల్లులో ప్రతిపాదించారు. ఇది 5 ఆఫ్‌ 1908 చట్టాన్ని ధిక్కరించేలా ఉందని కేంద్రం అభ్యంతరం చెప్పింది. దీంతో ట్రైబ్యునళ్ల ఏర్పా టు ప్రతిపాదనను సర్కారు వెనక్కి తీసుకుంది. కానీ.. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, టైటిల్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌ అనే పోస్టులను సృష్టించింది. అంతకుముందు ట్రైబ్యునళ్లకు ప్రతిపాదించిన అధికారులనే కాస్త తగ్గించి ఈ అధికారులకు కట్టబెట్టింది.


ట్రైబ్యునల్‌ చెప్పిందే చట్టం...

‘‘ట్రైబ్యునళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా చట్టం అమలులో మంచి కోసమే అని భావించాలి’’ అంటూ బిల్లులోని 41వ క్లాజులో వింత భాష్యం చెప్పారు. ట్రైబ్యునళ్లలో ఉండేది ప్రభు త్వం నియమించిన అధికారులు/రిటైర్డ్‌ అధికారులే! అధికార పార్టీ నేతలతో ఒత్తిళ్లతో వీరు అడ్డగోలు నిర్ణయం తీసుకున్నా...దానిని ‘మంచి కోసమే’ అని భావించాలట! ఓ రైతు భూమిని మరొకరి పేరిట మార్చేసి టైటిల్‌ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చినా అది మంచి కోసమనే భావించాలని ఈ క్లాజు సారాం శం. దీనిపై కేంద్ర హోం శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో ఆ క్లాజును బిల్లునుంచి వెనక్కి తీసుకున్నారు. కానీ... టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(టీఆర్‌వో), టైటిల్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌(టీఏవో)లకు దాదాపుగా ఇవే అధికారాలు కట్టబెట్టారు.

అసలుకే మోసం...

టైటిల్‌ రిజిస్ట్రేషన్‌, టైటిల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లు ఇచ్చే ఉత్తర్వులను జిల్లా కోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చని బిల్లులో ని సెక్షన్‌ 55(1)(4)లో పేర్కొన్నారు. దీన్ని కేంద్ర న్యాయ శాఖ తప్పుపట్టింది. ఒకవైపు టైటిల్‌ చట్టంలో సివిల్‌ కోర్టుల ప్రమేయాన్ని నిషేధిస్తూ, మరో వైపు జిల్లా కోర్టుల్లో అప్పీల్‌ చేయవచ్చనడం పరస్పర విరుద్ధంగా ఉందని తెలిపింది. దీంతో ఆ బిల్లు నుంచి ఈ క్లాజును వెనక్కి తీసుకుంది. అలాగ ని.. సివిల్‌ కోర్టుల్లో అప్పీలుకు అవకాశం కల్పించిందా అంటే అదీ లేదు. టీఆర్‌వో, టీఏవోల నిర్ణయాన్ని సవాలు చేయాలం టే ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సిందే. సివిల్‌, జిల్లా కోర్టులకు సంబంధమే లేదు. టైటిల్‌ బిల్లులోని సెక్షన్‌ 41 ప్రకారం... సివిల్‌ కోర్టుల ప్రమేయాన్ని నిషేధించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. సివిల్‌ ప్రోసీజర్‌ కోడ్‌-1908కి ఇది విరుద్ధమని... దీన్ని మార్చుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయినా... జగన్‌ పట్టించుకోలేదు. సివిల్‌ కోర్టులను పక్కకు తోసేశారు.


పునరావాసం.. ‘ప్రైవేటు’ వ్యాపారం

టైటిల్‌ చట్టం ద్వారా ఏర్పాటయ్యే ల్యాండ్‌ అథారిటీ కింద ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు పెద్ద ఎత్తున పునరావాసం/ఉపాధి కల్పించేలా క్లాజులు చేర్చారు. చట్టం చేసే పనులను ప్రైవేటుకు అప్పగించేలా స్కెచ్‌ గీశారు. కొన్ని రకాల లైసెన్సు ల జారీని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించేలా క్లాజు 67 కింద ప్రతిపాదనలు చేశారు. అలా నియమితులయ్యే వారి కి చట్టం పరిధిలో కీలక అధికారాలు కట్టబెట్టాలని భావించా రు. ల్యాండ్‌ అథారిటీ వద్ద ఉండే రైతుల భూములు, ఆస్తుల డేటాను ప్రైవేటు వ్యక్తులు వినియోగించుకునేలా సెక్షన్‌ 68లో మరో వెసులుబాటు కల్పించారు. దీన్ని కేంద్రం తప్పుపట్టింది. ప్రభుత్వం వద్ద ఉండే డేటాను ప్రైవేటుకు ఫీజులు తీసుకొని ఇవ్వడాన్ని తప్పుపట్టింది. చట్టం పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు విస్తృత అధికారాలు కల్పించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. టైటిల్‌ చట్టం అమలులో ఏవైనా ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు ఎప్పుడంటే అప్పుడు చట్టంలో మార్పులు చేసుకునే అధికారాన్ని జగన్‌ సర్కారు కట్టబెట్టుకుంది. దీన్ని కేంద్రం తప్పుపట్టింది. ఈ చట్టానికి, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంత అపరిమిత అధికారాలు ఉండటానికి వీల్లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అపరిమిత సవరణలకు వీల్లేదని చెప్పింది. దీంతో చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో ఏవైనా ఇబ్బందు లు వస్తే వాటిని అధిగమించేలా సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్ర భూ సేకరణ చట్టం-2013ను పూర్తిగా ధిక్కరించేలా టైటిల్‌ బిల్లును రూపొందించారు. భూ సేకరణ చట్టం కింద తీసుకునే ప్రతీ చర్యను నిర్దేశిత గడువులోగా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ట్రైబ్యునల్‌కు నివేదించాలని ఉంది. గడు వు మీరినా చెప్పకపోతే సంబంధిత అధికారులపై చర్య తీసుకునే అధికారం ఇచ్చారు. వీటి ని కేంద్రభూవనరుల విభాగం తప్పుపట్టింది.

అంతా మా ఇష్టం...

రిజిస్ట్రార్‌, సబ్‌రిజిస్ట్రార్‌లను టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ సేవలకు వాడుకుంటామని 27వ క్లాజు ప్రతిపాదించారు. రిజిస్ట్రేషన్‌ శాఖలోని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) సేవలను టైటిల్‌ రిజిస్ట్రేష న్‌ ట్రైబ్యునల్‌కు వాడుకుంటామన్నారు. ఇది రిజిస్ట్రేషన్‌ చట్టం- 1908కు విరుద్ధమని కేంద్రం తేల్చింది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ట్రైబ్యునల్‌, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లు కోరిన సమాచారం వ్యక్తు లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆరు నెలల జైలు శిక్షతోపాటు 50వేల రూపాయల జరిమానా విధించే అధికారాన్ని ట్రైబ్యునళ్లకు కట్టబెట్టారు. దీన్ని కేంద్ర హోం శాఖ తప్పుపట్టింది. దీంతో ఆ క్లాజును మార్చారు. జైలు శిక్షను తీసేసి, తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా విధిస్తామని చట్టం చేశారు. అయితే... ఇచ్చిన సమాచారం త ప్పో, రైటో తేల్చేది ప్రభుత్వం నియమించే అధికారులే! టైటిల్‌ చట్టం అమలులో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అపరిమి త అధికారాలతో పెత్తనం చెలాయించేలా ఈ బిల్లును రూపొందించడం గమనార్హం. ప్రజల ఆస్తులు, రైతుల సాగు భూ ముల డేటా వారి చేతుల్లో పెట్టాలనుకున్నారు. కేంద్ర ఆదేశాలతో ‘ప్రైవేటు’ ప్రస్తావన తీసి నా... మిగిలిందంతా దాదాపు సేమ్‌ టు సేమ్‌!

Updated Date - May 05 , 2024 | 07:30 AM