AP Elections: ఓటు వేసేందుకు షార్జా నుంచి ప్రవాసాంధ్రుల రాక...
ABN , Publish Date - May 11 , 2024 | 11:51 AM
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చారు. షార్జా, దుబాయ్ పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్‌కు ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.
కృష్ణా, మే 11: ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు (NRIs)ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు (Andhrapradesh) వచ్చారు. షార్జా (Sharja), దుబాయ్ (Dubaiu) పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్‌కు (Gannavaram Airport) ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి కృష్ణాజిల్లా వాసులు చేరుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..
మార్పు కోసం వచ్చాం...
ఈ సందర్భంగా షార్జా ప్రయాణికులు మాట్లాడుతూ.. ఆంధ్రాలో జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి తమ వంతు సాయం చేసి మార్పు తీసుకురావాలని వచ్చామన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఓటు వేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. తమకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేయటం గర్వంగా ఉందన్నారు. బాధ్యతగా ఓటు వేయటం మన హక్కని తెలిపారు. ఓటు వేసి మరుసటి రోజు దుబాయ్ వెళ్ళిపోతామన్నారు. ఐటీ ఉద్యోగానికి సెలవు పెట్టి ఓటు వేసేందుకు ఆంధ్రకు వచ్చినట్లు చెప్పారు. 30 సంవత్సరాల నుంచి దుబాయ్ లోనే స్థిరపడ్డామని.. ఓటు వేసి ఆంధ్రాను డెవలప్‌మెంట్ చేయాలని వచ్చామని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!
Read Latest AP News And Telugu News