AP Elections: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఢిల్లీరావు ఏమన్నారంటే..
ABN , Publish Date - May 11 , 2024 | 10:58 AM
Andhrapradesh: విజయవాడ, మే 11: మే 13న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్‌కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు(ఆదివారం) పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు.
విజయవాడ, మే 11: మే 13న ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్‌కు (Mock Polling) సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు (NTR District Collector Delhi Rao) శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు(ఆదివారం) పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు. 459 వాహనాలలో పోలింగ్ మెటీరియల్ పోలింగ్ సిబ్బందితో పోలింగ్ స్టేషన్లకు పంపుతామని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ వెళ్ళేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
Loksabha Polls: మహిళ ఓటర్లే కీలకం.. ఎందుకంటే..?
పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలో బ్లూ బటన్ నొక్కిన తరువాత, ఈవీఎంపైన బిజీ బటన్ ఆగిపోతే ఓటు వేసినట్టు అని చెప్పుకొచ్చారు. ఆరోజు ఉదయం 5:45కు మాక్ పోల్ ప్రారంభం అవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లను ఇవాళ మార్కింగ్ జరుగుతుందని.. ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్లు వారికి పంపుతామని తెలిపారు. మరణించినట్లు తప్పుగా నోట్ అయిన వారు ఎవరైనా ఉన్నారా అనేది ఇవాళ ఫైనల్ చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గంలో 8 పోలింగ్ స్టేషన్లు కోర్టు ఆదేశాలతో మర్పులు చేశామన్నారు. 27 స్ట్రాంగ్ రూంలు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని.. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
Pawan Kalyan: ఎట్టకేలకు పర్మిషన్.. ద్వారంపూడి ఇలాకాలో పవన్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
Read Latest AP News And Telugu News