Share News

YSRCP: వైసీపీలో ఉండలేమంటున్న నాయకులు.. అధ్యక్షుడి వైఖరిపై అసంతృప్తి

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:08 PM

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విశ్వాసం కోల్పోయినట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలో పెదగ్గా కనిపించడం లేదు. సగం రోజులు ..

YSRCP: వైసీపీలో ఉండలేమంటున్న నాయకులు.. అధ్యక్షుడి వైఖరిపై అసంతృప్తి
YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు వరకు జగన్‌కు జై కొట్టిన నాయకులు.. ప్రస్తుతం జగన్ పార్టీలో మేం ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధ్యక్షుడి వైఖరి కారణంగా స్థానికంగా కొందరు పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది నాయకులు పార్టీలో ఉన్నా.. అంతిముట్టనట్లు వ్యహరిస్తున్నారట. ఎన్నికల తర్వాత జగన్ వైఖరిలో ఏ మాత్రం మార్పులేకపోవడంతో వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ మారదామనే ఆలోచనలో కొందరు నాయకులు ఉన్నారట. ప్రజల్లో వైసీపీపై రోజురోజుకు అభిమానం తగ్గి.. వ్యతిరేకత పెరుగుతోందని.. ఈసమయంలో పార్టీలో ఉంటే రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోనే వైసీపీని వీడాలనే నిర్ణయానికి కొందరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్‌తో సన్నిహితంగా ఉన్న నాయకులు సైతం ప్రస్తుతం ఆ పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదట. అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ నాయకులను అసలు పట్టించుకోలేదని.. జగన్ ఏకపక్ష విధానాల కారణంగానే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని కొందరు నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.


అధ్యక్షుడి వైఖరిపై..

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విశ్వాసం కోల్పోయినట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలో పెదగ్గా కనిపించడం లేదు. సగం రోజులు బెంగళూరులో ఉంటే మరో సగం రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు కొందరు నాయకులను తాడేపల్లి పిలిపించుకుని సమావేశమైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కొన్నిచోట్ల కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోకపోవడం, గ్రామ, పట్టణ స్థాయి కేడర్‌ను పట్టించుకునే నాధుడే కరువయ్యారట. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ప్రభావం చూపించబోదని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు మూడు నెలలు కాకముందే కొత్త ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడం జగన్‌కు ప్రజల్లో మైనస్‌గా మారుతుందనే చర్చ జరుగుతోంది.


వైసీపీకి గుడ్‌బై..

మాజీ మంత్రులు చాలామంది ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. మరికొంతమంది మాజీ మంత్రులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారట. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్‌పై ప్రజల్లో సానుభూతి లేదని, ఆయన వ్యవహారశైలి కారణంగా ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందట. ఈ సమయంలో పార్టీలో ఉండటంకంటే వేరే దారి చూసుకోవడమే బెటర్ అనే అభిప్రాయంలో చాలామంది నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్‌కు బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం వైసీపీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Anadhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 12 , 2024 | 12:09 PM