AP Govt: శ్వేతపత్రాల షెడ్యూల్ విడుదల.. ఆ శాఖలపై ప్రభుత్వం ప్రధాన దృష్టి
ABN , Publish Date - Jun 24 , 2024 | 03:40 PM
వైసీపీ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్ణయించారు. ఈ మేరకు ఓ షెడ్యూల్‌ను కూడా నిర్ణయించింది. దీనిని సోమవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మంత్రులతో కమిటీ వేసే ఆలోచన చేస్తున్నారు.శ్వేత పత్రాల రూపకల్పనపై అధికారులతో మంత్రుల కమిటీ నిశితంగా చర్చించనున్నది. ఈరోజు(మంగళవారం) కేబినెటి భేటీలో మంత్రుల కమిటీ వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ శ్వేతపత్రాలివే..
ఈ నెల 25న పోలవరంపై...
28న రాజధాని అమరావతిపై..
జులై 1న విద్యుత్,
జులై 4న సహజ వనరుల దోపిడీ, ఇసుక, భూములు, మైనింగ్‌పై శ్వేతపత్రం
జులై 8న మద్యం మాఫియా,
10న శాంతి భద్రతలపై..
జులై 12న ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలు విడుదల
ఆయా శాఖలు శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.