Share News

AP News: సీఎం చంద్రబాబుకు వరద బాధితుల కృతజ్ఞతలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:31 AM

Andhrapradesh: విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయం అంటూ వరద బాధితులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా బాబు బంగారం’’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

AP News: సీఎం చంద్రబాబుకు వరద బాధితుల కృతజ్ఞతలు
Flood victims thank to CM Chandrababu

విజయవాడ, సెప్టెంబర్ 18: టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) చిత్ర పటానికి టీడీపీ కార్యకర్తలు, వరద బాధితులు పూలాభిషేకం చేశారు. విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయం అంటూ వరద బాధితులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా బాబు బంగారం’’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పని తీరు ఆదర్శమన్నారు.


Srinivasrao: చీటెడ్ అకౌంటెంట్ విజయసాయి నోరు అదుపులో పెట్టుకో..


ఇప్పుడు వరద బాధితులకు 25 వేల రూపాయలు సాయం అందిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఈ తరహాలో సాయం అందించిన సీఎం ఎవరూ లేరని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ నిద్రాహారాలు మాని పని చేసిన సీఎం చంద్రబాబు అని కొనియాడారు. విజయవాడ, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉన్నారన్నారు. దీనిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గత ఐదేళ్లల్లో‌ప్రజల పాట్లు జగన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా వరద రాజకీయం‌ చేయడానికి నవ్వుతూ వచ్చి ప్రజల్లో నవ్వుల పాలయ్యారన్నారు. కోటి రూపాయలు జగన్ ఎవరికి ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తుల్లో ప్రజలను ఆదుకోకపోగా కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రజలంతా‌ చంద్రబాబు పడిన కష్టం చూసి చలించారన్నారు. చంద్రబాబుకు పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు ప్రజలే స్వచ్చందంగా చేస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..



వరద బాధితులకు ప్యాకేజీ..

మరోవైపు.. భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడి వరదనీరు విజయవాడ నగరంలోని అనే ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి ఆహారం, తాగునీరు అందేలా పక్కాగా చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు సాయం అందజేస్తున్నట్లు ప్యాకేజీ వివరాలను తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాం. విజయవాడ వరదల సమయంలో 10రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశా. ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాం. విజయవాడ నగరంలో వారం, పది రోజులపాటు వరదలో చిక్కుకుని ముంపునకు గురైన ప్రతి ఇంటికీ రూ.25వేలు ఆర్థికసాయం, పైఅంతస్తుల్లో ఉన్న వారికి రూ.10వేలు ఆర్థికసాయం చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు.


’’రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలకు ఇల్లు మునిగి ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు అందిస్తాం. కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ.25వేలు, ఎంఎస్ఎంఈలకు, వ్యాపార సంస్థ స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.50లక్షల వరకూ ఆర్థికసాయం చేయాలని నిర్ణయించాం. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు చొప్పున అందిస్తాం.అలాగే దెబ్బతిన్న ధాన్యం, పత్తి, చెరకు, వేరుసెనగ పంటలకు హెక్టారుకు రూ.25వేలు, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.35వేలు సాయం చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నాం. బ్యాంకులు, ఇన్‌స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నాం. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకూ పరిహారం అందిస్తున్నాం. వరదల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నామని" సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ

AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 11:36 AM