ఘనంగా యోగి వేమన జయంతి
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:43 AM
వేమన పద్యాలు, శతకాలలోని నీతిని జీవితంలో అనుకరించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి సంపత్‌కుమార్ అన్నారు.
ఘనంగా యోగి వేమన జయంతి
సత్యనారాయణపురం, జనవరి 19: వేమన పద్యాలు, శతకాలలోని నీతిని జీవితంలో అనుకరించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి సంపత్‌కుమార్ అన్నారు. సత్యనారాయణపురం చిత్తరంజన్‌శాఖా గ్రంథాలయంలో శుక్రవారం ప్రజాకవి యోగి వేమన 657వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వేమన చిత్రపటానికి సంపత్‌కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదాయనికి హత్తుకునేలా చెప్పాడన్నారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన తెలుగు పద్యాలు ప్రతీ ఒక్కరికి సుపరిచితాలు అన్నారు. విద్యార్థులకు వేమన నీతి పద్యాలను వివరించారు. అనంతరం వేమన నీతిపద్యాలలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.