Share News

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:32 AM

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

పేర్ని నానిపై  మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు (Mines, Underground Resources), ఎక్సైజ్ శాఖ మంత్రి (Excise Minister) కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ సీఎం జగన్ (CM Jagan) అరాచకాలకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తమకు 95 శాతం మ్యాండెట్ ఇచ్చారన్నారు. అయినా పేర్ని నాని లాంటి వాళ్లు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, ఇప్పటికే మచిలీపట్నం ప్రజలు పేర్ని నానిని చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చినా పద్ధతి మార్చుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆయన ఇలాగే మాట్లాడితే మచిలీపట్నం నుంచి కూడా ప్రజల తరిమికొడతారన్నారు. ఐదేళ్లుగా పేర్ని నాని చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టి..చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మాజీ వైసీపీ ఎంపీకు హైకోర్టులో ఎదురుదెబ్బ

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 26 , 2024 | 11:32 AM

News Hub